తమది ప్రజారంగక పాలన అని తమ ప్రభుత్వం పై ప్రజలు అన్ని విధాలుగా సంసృప్తిగా ఉన్నారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన వివిధ ప్రసార మాధ్యమాలతో మాట్లాడారు.
- రెండున్నర ఏళ్ల పాలన చాలా సంతృప్తి కరంగా ఉంది.
- కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.
- ప్రతిపక్షాల విమర్శల్లో అర్థం లేదు. వారికి ప్రజల మద్దతు లేదనే విషయంలో జీహెచ్ఎంసీతో పాటుగా ఉప ఎన్నికల్లో బయటపడింది.
- లక్ష ఉద్యోగాల కల్పనలో ప్రగతిని సాధించాం. ఇప్పటికే 62వేల ఉద్యోగాల నియమకాలు చేపట్టాం. ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతోంది.
- అవినీతి రహత తెలంగాణ దిశగా దూసుకుని పోతున్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గణనీయంగా తగ్గింది. ఆన్ లైన్ వ్యవస్థ వల్ల అవినీతిని అంతం చేస్తున్నాం.
- హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం. మెట్రో రైలు 2018 నాటికి పరుగులు పెడుతుంది.
- హైదరాబాద్ రోడ్ల పరిస్థితిని అధ్యాయనం చేస్తున్నాం త్వరలోనే రోడ్ల పరిస్థితి మెరుగవుతుంది.
- హైదరాబాద్ లో మురుగునీటి పారదలపై ప్రత్యేక దృష్టి, చెత్త తరలింపుకు జపాన్ తరహా విధానాన్ని తీసుకుని వస్తున్నాం. ఇప్పటికే జపాన్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి.
- కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. పనులు త్వరిత గతిన పూర్తవుతున్నాయి. రాజకీయ విమర్శలను పట్టించుకోం.
- హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ ఐటి పార్కులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.