దృవ అబౌ యావరేజ్…

రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దృవ సినిమాకు మంచి మార్కులే వేస్తున్నారు విమర్శకులు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మాతృక తని ఒరువన్, తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.  తమిళంలో వందకోట్లకు పైగా వసులు చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు బాగా ఆశలు పెట్టుకున్నారు. తమిళ సినిమాను పూర్తిగా అనుకరించకుండా మన నేటివిటీకి దగ్గరగా ఈ సినిమాను తీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

అభిమానుల అంచానాలకు తగ్గట్టుగానే రామ్ చరణ్ నటించారు. అభిమానులు కోరుకున్న అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ఉన్నాయి. చిత్రీకరణ, ఛాయాగ్రహణం చిత్రాన్ని నిలబెట్టింది. రోజా ఫేం అరవింద్ స్వామి చిత్రానికి హైలెట్ గా నిల్చారు. సాఫ్ట్ అండ్ స్మార్ట్ విలన్ గా అరవింద స్వామి మెప్పించారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నటనకు పెద్దగా అవకాశం లేని పాత్ర. కేవలం రామ్ చరణ్ కు జంటగా మాత్రమే కనిపించే రకుల్ గ్లామరస్ గా కనిపించింది.

సన్నివేశాల చిత్రీకరణ, కధనం బాగున్న కొన్ని చోట్ల చిత్రాన్ని సాగతీసినట్టుగా కనిపిస్తుంది. ఇదే ఈ చిత్రానికి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఓవరాల్ గా దృవ యావరేజ్ చిత్రంగానే కనిపిస్తోంది. అయితే అభిమానులు మాత్రం మంచి యాక్షన్ థిల్లర్ చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం. రామ్ చరణ్ అభిమానులను ఈ చిత్రం అలరిస్తుందనే చెప్పాలి.