తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉన్న వార్థా తుపాను మందకోడిగా కదులుతోంది. ఈ తుపాను తీరంగా దాటేందుకు మరో 48 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ భావిస్తోంది. తుపాను తీరం దాటిన తరువాత అంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలలో పాటుగా తెలంగాణ లోని పలు చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ప్రభావం తీరం దాటిన తరువాత తెలంగాణ పై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటిన తరువాత తుపాను ప్రభావం వల్ల పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరో వైపు తెలంగాణలో చలితీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతం నుండి వీస్తున్న చలిగాలులకు తోటు తుపాను ప్రభావం వల్ల వర్షాలు కురిస్తే చలి మరింత పెరుగుతుంది. కనిష్టంగా మెదక్ లో 11 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ లో 13 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.