తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే:పొంగులేటి

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందంటూ టీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలు చేసుకోవడం సరికాదని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల ఆకాక్షను గుర్తించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. తెలంగాణను తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది తప్ప టీఆర్ఎస్ కు కాదని ఆయన స్పష్టం చేశారు. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చినట్టుగా టీఅర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనల పట్ల సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఎప్పుడు సోనియా ఊసు ఎత్తకుండా సంబరాలు చేసుకోవడం ఏంటని ఆయన  ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అని అమెకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని పొంగులేటి అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని పొంగులేని అన్నారు.