తెలంగాణ ఎవరిది

0
46

మిషన్ భగీరథపై అసెంబ్లీలో చర్చ కాసేపు పక్కదారి పట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, సీఎల్పీనేత జానారెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ ఎవరిది అనే దానిపై ఇరువురు నేతలు వాదులాటకు దిగారు.

 • మిషన్ భగీరథపై చర్చ సందర్భంగా ఈ పథకంపై తమకు అనుమానాలున్నాయని కాంగ్రెస్ సభ్యుడు బట్టి విక్రమార్క అన్నారు.
 • నా తెలంగాణ ఆడబిడ్డలు బిందె పట్టుకుని పోయే స్థితి రావద్దనే ఈ పథకాన్ని ప్రారంభించామన్న ఈటెల వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
 • నా తెలంగాణ అనడం సరికాదని జానారెడ్డి అన్నారు. మన తెలంగాణ అనాలంటూ విరుచుకుపడ్డారు.
 • తెలంగాణను ఇచ్చింది మేమే… నా తెలంగాణ అనడం సరికాదని మండిపడ్డ జానా
 • దీనిపై స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ఎన్నడూ నా తెలంగాణ అనుకోలేందటూ సమాధానం
 • తెలంగాణను మేముచ్చామంటే కుదరని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి అన్న కేటీఆర్
 • కాంగ్రెస్ ను ప్రజలు ఛీ కొడుతున్న సంగతి గుర్తుంచుకోవాలి:కేటీఆర్
 • తెలంగాణ వచ్చిన సమయంలో రెండు చోట్లా మేమే అధికారంలో ఉన్నాం తల్చుకుంటే అణచేవాళ్లం:జానా
 • తెలంగాణ విషయంలో సహాయం చేయమని కేసీఆర్ నా ఇంటికి వచ్చారు:జానా
 • అహంకారం పనికిరాదు:జానా
 • తెలంగాణ ఉధ్యమాన్ని అణచివేసేవారు:కేటీఆర్
 • అహంకారంతో మాట్లాడుతోంది మేరే:కేటీఆర్.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here