తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

శుక్రవారం డిసెంబరు 16వ తేదీ నుండి 30వ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని అధికార విపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షాన్ని నిలదీస్తామని తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల  పై చర్చకు సిద్ధంగా ఉన్నమని ప్రధాన విపక్షం స్పష్టం చేసింది. మరో వైపు ప్రతిపక్షలన్నింటినీ కూడగట్టి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై అన్ని పార్టీలు పార్టీ కార్యాలయాల్లో సమావేశమై చర్చించుకున్నాయి.

అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో హుందాగా వ్యవహారించాలని పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు అంతా తప్పకుండా హాజరుకావాలని అన్నారు. మంత్రులు చర్చ సందర్భంగా పూర్తి సమాచారంతో రావాలని సభ సజావుగా నడుపుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు. విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని సభ సమయాన్ని వృద్ధా కాకుండా చూసుకుందామని కేసీఆర్ చెప్పారు. విపక్షాలు అడిగే ఎటువంటి ప్రక్షలకైనా సమాధానం చెప్పే పరిస్థితిలో మంత్రులు ఉండాలని తమ శాఖలకు సంబంధించి పూర్తి సమాచారంతో అసెంబ్లీకి రావాలని సీఎం సూచించారు.