తెలంగాణలో ఉరికంబంమే లేదు

తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉరికంబంమే లేదు. దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష పడిన నేపధ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష పడినప్పటికీ ఈ శిక్షను హైకోర్టు దృవీకరించాల్సి ఉంది. దీనికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ అసలు దోషులను ఉరి తీయడానికి ఉన్న అవకాశాలను గురించి ఆరా తీస్తే తెలంగాణలో అసలు ఉరితీసే సౌకర్యాలు లేవని తేలింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కేంద్ర కారాగాగాలున్నాయి. అందులో ఒకటి చంచల్ గూడ కేంద్ర కారాగారం కాగా మరొకటి వరంగల్ కేంద్ర కారాగారం. ఈ రెండిటిలో కూడా ఉరికంబాలు లేవు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిలో ఉరికంబం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉరికంబం కోసం రాష్ట్ర జైళ్ల శాఖ పంపిన ప్రతిపాదనలకు ఇంకా అనుమతి లభించలేదు. దీనితో తెలంగాణలో ఉరివేసే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఉరికంబం ఉన్నప్పటికీ దాన్ని వాడి దాదాపు 40 సంవత్సరాలు అయింది. రాజమండ్రిలో ఆఖరిసారిగా 1976లో అనంతపురంకు చెందిన నబి కృష్ణప్ప అనే వ్యక్తిని ఉరితీశారు. ఆ తరువాత ఉరికంబం అవసరం రాలేదు.  ప్రస్తుతం ఉగ్రవాదుల ఉరిశిక్షలను న్యాయస్థానం ఖరారు చేసే లోపల కొత్త ఉరికంబానికి అనుమతి లభిస్తుందా లేక ఇతర రాష్ట్రాలకు తరలించి ఉరి తీస్తారా అనే సంగతి చూడాలి.