తెలంగాణను తెచ్చిన దీక్షకు ఐదేళ్లు

తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ నాటి తెంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) అధినేత నేటి ముఖ్యమంత్ర కేసీఆర్ ఐదు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు మొదలు పెట్టిన దీక్ష తెలంగాణ ఉధ్యమ చరిత్రను మార్చిన కీలక ఘట్టంగా చెప్పవచ్చు. కరీంనగర్ లోని తన స్వగృహం నుండి దీక్షా స్థలం సిట్టిపేటకు బయలు దేరిన కేసీఆర్ దీక్షను భగ్నం చేసేందుకు నాటి ప్రభుత్వం శత విధాలా ప్రయత్నాలు చేసింది.  కేసీఆర్ ను అరెస్టు చేసిన ప్రభుత్వం అయన్ను ఖమ్మం అస్పత్రికి తరలించింది. అప్పుడే కేసీఆర్ దీక్షను విరమించారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అయితే తాను దీక్షను విరమించలేదని కేసీఆర్ ప్రకటించడంతో ఆయన్ను తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఆస్పత్రిలోనే కేసీఆర్ దీక్షను కొనసాగించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉధ్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో దీని సెగలు ఢిల్లీకి తాకాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము సానుకూలంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉధ్యమ చరిత్రు మలుపుతిప్పిన ఘటనగా కేసీఆర్ దీక్షన మేధావులు చెప్తున్నారు. ఈ క్రమంలో దీక్ష దివస్ ను టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది.