తెరపైకి సైఫ్ కూతురు

ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ల కూతురు సారా అలీఖాన్ త్వరలో హీరోయిన్ గా తెరపై కనిపించనుంది. ఈమె తెరపై తొలిసారిగా ఏ చిత్రంలో నటించనున్నారు అనే అంశంపై స్పష్టత లేదు. తొలుత కరణ్ జోహర్ సినిమాతో సారా అలీఖాన్ తెరంగేట్రం చేయబోతున్నారని వార్తల వచ్చాయి. అయితే కరణ్ తో తన తల్లి అమృతా సింగ్ కి విభేదాలు ఉండడంతో కరణ్ జోహర్ చిత్రానికి సారా నో చెప్పినట్టు సమాచారం. అటు తర్వాత రణవీర్ సింగ్ హీరోగా జోయా అక్తర్ దర్శకత్వంలో ఈ అందాల భామ నటిస్తున్నారంటూ ప్రచారం సాగింది. దీన్ని సినీ వర్గాలు దృవీకరించాయి కూడా అయితే తాజాగా కరమ్ మల్హోత్రా దర్శకత్వంలో హృతిక్ రోషన్ సరసన సారా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలి చిత్రం ఏదయినా మరో వారసురాలు సినీమా స్క్రీన్ మీద కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.