తుపానుగా మారిన వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం బలపడి తుపాను గా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ప్రస్తుతం అండమాన్ దీవులకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుపాను మందకోడిగా కదులుతోందని వారు పేర్కొన్నారు. ఈ తూపానుకు వార్థా అని పేరు పెట్టారు. ఈ తుపాను తీరాన్ని తాకడానికి మరో మూడు రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచానా వేస్తున్నారు. ఈ తుపాను వల్ల ఉప్పటికే అండమాన్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల తరువాత అంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. తుపాను మందకోడిగా కదులుతున్నందు వల్ల తీరాన్ని దాటే సమయానికల్ల తుపాను బలహీనపడే అవకాశం ఉందని వారంటున్నారు. దీని వల్ల పెద్ద నష్టం వాటిల్లే అవకాశాలు లేవని అయినా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఓడ రేవుల్లో ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు.