తమిళనాడు ముఖ్యకార్యదర్శి కార్యాలయం, నివాసలపై ఇడి జరుపుతున్న దాడులు తీవ్ర సంచలనాన్ని కలిగిస్తున్నాయి. ఏకంగా ఒక ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి ఇంటిపై దాడులు నిర్వహించడం తమిళనాడులో ఇదే ప్రధమం. దేశం మొత్తం మీద కూడా ప్రధాన కార్యదర్శ స్థాయి అధికార నివాసాలపై దాడులు జరగడం చాలా అరుదు. తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మెహన్ రావు నివాసంతో పాటుగా ఆయన కుమారుడు ఇతర బంధువుల నివాసాలపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. రామ్మోహన్ రావును పోలీసులు అదుపుకులోకి తీసుకునే అవకాశం ఉంది.
అంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ఐఏఎస్ అధికారి 1985 బ్యాచ్ కు చెందినవారు. అన్నాడీఎంకే పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలిగే మోహన్ రావు జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ ఆ తరువాత ఆమె మరణం తరువాత కీలక పాత్రను పోషించారు. జయ లిలిత నెచ్చేలి శశికళకు అత్యంత ఆప్తుల్లో ఒకరిగా మోహన్ రావుకు పేరుంది. ఆయన శశికళకు వ్యక్తిగత సలహాదారుడిగా కూడా వ్యవహరిస్తుడని సమాచారం. ప్రభుత్వ వర్గాలతో పాటుగా రాజకీయ వర్గాల్లోనూ మోహన్ రావు చక్రం తిప్పుడాని అంటారు.
అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే మోహన్ రావు దశతిరిగింది. అప్పటివరకు అనామక పోస్టుల్లో ఉండిపోయిన ఆయన అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర సీనియర్లను తోసిరాజని ఏకంగా ముఖ్యకార్యదర్శి పదవిని చేపట్టారు. రామ్మోహన్ రావు నివాసంతో పాటుగా ఆయన బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారంతో పాటుగా కీలక డాక్యుమెంట్లు దొరికినట్టు సమాారం. ఆయన నివాసంలో దాదాపుగా 30 కోట్ల రూపాయలు దొరికినట్టు అనధికార సమాచారం. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త, టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసాలపై దాడులు జరిపిన సమయంలో వీరిద్దరి కి మధ్య ఉన్న సంబంధాలు బయటపడ్డాయి.