తమిళనాడు కొత్త సీఎం పన్నీరు సెల్వం

జయలలిత మరణంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఓ.పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి జయలలిత మృతిచెందినట్టుగా అపోలో ఆస్పత్రి ప్రకటించిన తరువాత రాజ్ భవన్ లో పన్నీరు సెల్వంతో గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటుగా మరో 32 మంది మంత్రులు కూడా ప్రణాస్వీకారం చేశారు. ఎంజీఆర్‌కు అభిమానిగా 1970ల్లో టీ స్టాల్‌తో కెరీర్ ప్రారంభించిన ఓ పన్నీర్ సెల్వం.. 1980 మధ్యకాలంలో పూర్తిగా రాజకీయాల్లో చేరారు. ఎంజీఆర్ మృతి తర్వాత తొలుత జానకీ రామచంద్రన్‌కు మద్దతునిచ్చినా.. తర్వాత పురచ్చితలైవికి నమ్మకస్తుడిగా మారారు. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఓ పన్నీర్ సెల్వం ఎన్నికయ్యారు.థేని జిల్లాలోని బోదినాయకన్నూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పన్నీర్ సెల్వం.. గతంలో జయ లీగల్ కేసులను ఎదుర్కొంటున్నప్పుడు రెండుసార్లు (2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటో తేదీ వరకు, 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకు) సీఎంగా పనిచేశారు.