డెబిట్,క్రెడిట్ కార్డుల వినియోదారులకు చల్లని కబురు

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను పెద్ద ఎత్తున మళ్లించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రు.2000 లోపు జరిపే లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న పన్నును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీని ద్వార వీటి వినియోగం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా నిర్వహించే అన్ని లావాదేవీలపై 15శాతం సేవా పన్నును విధించేవారు ప్రస్తుతం ఈ పన్నును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల వీటి వినియోగం బాగా పెరుగుతుందని భావిస్తున్నారు.