డిపాజిట్ల విషయంలో వెనక్కి తగ్గిన ఆర్బీఐ

ఐదువేల రూపాయలు ఆ పైన బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకునే వారికి ఒకసారికి మాత్రమే అవకాశం ఉంటుందని ప్రకటించిన అర్బీఐ ఆ నిర్ణయాన్ని ఒక్క రోజులోనే వెనక్కి తీసుకుంది. ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 30వ తారీకు లోపల ఒకసారికి మాత్రమే అవకాశం ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అర్బీఐ ఆ నిర్ణయాన్ని ఒక్క రోజులోనే వెనక్కి తీసుకుంది. ఐదువేల రూపాయలకు పైబడి డిపాజిట్లు చేయదల్చిన వారు బ్యాంకు అధికారులకు ముందుగా సరైన వివరణ ఇవ్వాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు వారిచ్చిన వివరణకు సంతృప్తి చెందితేనే డిపాజిట్లు స్వీకరిస్తారని తొలుత ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకున్న ఆర్బీఐ డిసెంబర్ 30వ తారీకులోపున పాత నోట్లు కూడా ఎన్నిసార్లు అయినా ఎంత అయినా డిపాజిట్ చేయవచ్చని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *