ట్యాక్సీ డ్రైవర్ అకౌంట్ లో పదివేలకోట్లు

బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల ఒక ట్యాక్సీ డ్రైవర్ బ్యాంకు అకౌంట్ లో ఏకంగా పదివేల కోట్లు వచ్చి చేరాయి. అంత మొత్తంలో డబ్బు తన అకౌంట్ లో వచ్చి పడడంతో షాక్ కు గురైన పంజాబ్ కు చెందిన బల్విందర్ సింగ్ అనే టాక్సీ డ్రైవర్ బ్యాంకు అధికారులను సంప్రదించగా బ్యాంకు ఉద్యోగుల పొరపాటు వల్ల ఈ తప్పు జరిగిందని మరోసారి జరక్కుండా చూసుకుంటామని చెప్పారు. ఈ షాక్ ను తేరుకోక ముందే మరో సారి ఇతని బ్యాంకు ఖాతాలో దాదాపు వెయ్యి కోట్లు జమ అయినట్టు అతని ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో తన అకౌంట్ లో జమ కావడంతో మరోసారి బ్యాంకుకు పరుగుపెట్టాడా వ్యక్తి దీనితో మరోసారి నాలిక కరుచుకున్న బ్యాంకు సిబ్బంది ఇప్పుడు ఏకంగా తాత్కాలికంగా ఆయన అకౌంట్ ను నిలిపివేశారు.