టైమ్ మ్యాగజైన్ పై ట్రంప్ అభిమానుల ఆగ్రహం

ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ టైమ్ మ్యాగజైన్ పై అమెరికా అధ్యుక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఏడాది మేటి వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ డోనాల్డ్ ట్రంప్ ను ఎంపిక చేసింది. అయితేవిభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు అంటూ టైమ్ మ్యాగజైన్ తమ కవర్ పేజీపై ట్రంప్ ఫొటోను వేస్తూ ముద్రించింది. దీనిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. మరో వైపు ట్రంప్ ను అవమానించే రీతిలో ఫొటోను టైమ్ మ్యాగజైన్ ప్రచురించిందని ట్రాంప్ కు కొమ్ములు వచ్చే విధంగా కవర్ పేజీనీ డిజైన్ చేసిందని ట్రంప్ అభిమానులు అంటున్నారు.