టైటిల్ దిశగా జూనియర్ హాకీ జట్టు

ఒకప్పుడు హాకీలో ప్రపంచాన్ని ఏలిన భారత్ ఆ ప్రాభవాన్ని క్రమంగా కోల్పోయినా తిరిగి భారత హాకీ జవసత్వాలు నింపుకుంటోంది. భారత సీనియర్ హాకీ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుండగా జూనియర్ జట్టు కూడా తన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. భారత్ లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ హాకీ టోర్నమెంటులో అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ దిశగా దుసుకుని పోతోంది. ఫైనల్ కు చేరుకున్న భారత జూనియర్ హాకీ జట్టు టైటిల్ కు ఇప్పుడు కోవలం ఒక అడుగు దూరంలో ఉంది.

తన ఆట తీరుతో అభిమానులను అలరిస్తున్న భారత జూనియర్ హాకీ జట్టు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో బెల్జియంతో తలపడనుంది. సెమీఫైనల్ లో పటిష్టమైన ఆష్ట్రేలియా పై విజయం సాధించిన భారత్ ఫైనల్ లోకి దూసుకుని పోయింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఆశించిన స్థాయిలో ఆడుతోంది. ఫైనల్ లో బెల్జింయం ను ఓడిస్తే టైటిల్ భారత్ వశం అవుతంది. 2001లో చివరిసారిగా భారత్ జూనియర్ హాకీ టైటిల్ ను గెల్చుకుంది.