టీ20 సిరీస్‌ రోహిత్‌ సేనదే..

నాగ్‌పూర్‌ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ బంగ్లాపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై భారత్‌ సీరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. దీపక్‌ చాహర్‌ దాటికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. 7పరుగులు ఇచ్చి 6వికెట్లు తీసిన చాహర్‌ అజంతా మెండిస్‌ రికార్డు(6\8) బ్రేక్‌ చేశాడు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఫలితంగా మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తేడాతో రోహిత్‌ సేన కైవసం చేసుకుంది.