జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఆఫర్

భారత టెలికాం రంగంలో జియో పెనుమార్పులకు శ్రీకారం చుట్టినట్టుగానే కనిపిస్తోంది. జియో రాకకము ముందు టెలికాం రంగంలో పోటీ ఉన్నప్పటికీ ధరల యుద్ధం మాత్రం జియో రాకతో పాతక స్థాయికి చేరుకుంది. జియోతో యుద్ధానికి సై అంటోంది  ప్రభుత్వం రంగ టెలికాం దిగ్గజం  భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) . జియో ఫ్రీ ఆఫర్ కు పోటీగా మరో కొత్త ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ ముందుకు వస్తోంది. నెలకు రూ.149  రీచార్జ్ తో  ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్  లోకల్ అండ్  నేషనల్ వాయిస్ కాల్స్ తోపాటు 300 ఎంబీ డాటా  సదుపాయంతో ఈ ప్లాన్ ను   లాంచ్ చేయనుంది. జనవరి 1 నుంచి  ఈ  ప్లాన్ వినియోగ దారులకు అందుబాటులోకి రానున్నట్టు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నెల రూ 149 వద్ద భారతదేశం అంతటా ఏ నెట్వర్క్ వద్ద మొబైల్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రారంభించేందుకు  కృషి చేస్తున్నామని  బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.  జియో  28-రోజుల వాలిడిటీతో , 300 ఎంబీ డేటా , అన్ లిమిటెడ్ కాల్స్ ,  100 లోకల్ అండ్  నేషనల్ ఎస్ఎంఎస్ లను రూ 149  రీచార్జ్ ప్లాన్ లో అందచేస్తుండగా దీనికి పోటీగా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకుని వస్తోంది.