జాతీయ గీతానికి అవమానం

జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలోనూ ఫోన్ లో ముచ్చటిస్తున్న బెంగాల్ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వైశాలి దాల్మియా హౌరాలో జరుగుతున్న క్రీడా కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ జాతీయ గీతాలాపన జరుగుతున్న సమయంలోనూ ఫోన్ లో ముచ్చటిస్తున్న సదరు ఎమ్మెల్యే అంతా తనను గమనిస్తురన్న సంగతి గమనించి ఫోన్ ను కట్ చేశారు. అప్పటికే ఆమె ఫోన్ లో ముచ్చటిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
    జాతీయ గీతాన్ని అగౌరపర్చే విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. జాతీయ గీతానికి అవమానం కలిగిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకంటారో లేదో వేచి చూడాల్సిందే. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు జాతీయ గీతాలపన సమయంలో కూడా ఫోన్ లో ముచ్చటించడాన్ని పలువురు ఖండిస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు తిరిగి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లు వినిపిస్తున్నాయి.
అరెస్టు చేశారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.