జయ ప్రతిమకు అంత్యక్రియలు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా జయకు తమ సంప్రదాయం ప్రకారం మరోసారి అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించిన ఆమె బంధువులు కొందరు జయ ప్రతిమను తాయారు చేయించి దానికి దహన సంస్కారాలు నిర్వహించారు. జయలలిత పార్థీవ దేహాన్ని ఖననం చేయడం వల్ల ఆమె ఆత్మకు శాంతి లభించదని అందుకోసమే అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం జయలలితకు అంత్యక్రియలు నిర్వహించినట్టు జయలలిత బంభువులు పేర్కొన్నారు.
   కర్ణాటకలోని  ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగపట్నంలో కావేరీ నది ఒడ్డున ఈ కార్యక్రమాలు నిర్వహించారు. జయలలితకు సోదరుడి వరసయ్యే వరదరాజు ఈ అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించారు. జయలలిత ఆత్మకు శాంతి కలగాలని మాత్రమే తాము తిరిగి అంత్యక్రియలను నిర్వహిస్తున్నామని వారంటుననారు. ఐదు రోజుల పాటు జయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జయలలిత అంత్యక్రియలను కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వారు మండిపడ్డారు. జయలలిత కుటుంబం నమ్మకాలను, ఆచార వ్యవహారలకు వారు గౌరవం ఇచ్చి ఉండాల్సిందని అన్నారు.
     కుబుంట సభ్యులను దూరంగా పెట్టి అంత్యక్రియలు వేరే పట్టతిలో నిర్వహించడం వల్ల జయలలిత ఆత్మకు శాంతి లభించదని అందుకే కుటంబ సభ్యుల కోరిక మేరకు తాను ఈ అంత్యక్రియల కార్యక్రమాలను పద్దతి ప్రకారం చేయిస్తున్నానని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న రంగనాథ్ అయ్యంగార్ చెప్పారు. శాస్త్ర ప్రకారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాన్నారు.