జయ ఆస్పత్రి బిల్లులు పంపని అపోలో

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలితకు జరిగిన చికిత్సకు సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఎటువంటి ఛార్జీలను ఇప్పటివరకు అడగలేదట. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు దృవీకరించాయి. జయలలిత చికిత్సకు 6కోట్ల రూపాయలు కాగా ఆసుపత్రి వర్గాలకు ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తమిళనాడు ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారని అసుపత్రిలో జయకు అత్యంత ఆధునిక చికిత్స అందిందని దీనితో పాటుగా పేరున్న వైద్యుు చికిత్స నిర్వహించారని చెప్పారు.

జయలలిత ఆసుపత్రి బిల్లులకు సంబంధించి ఆపోలో యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు పంపలేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అపోలో ఆసుపత్రికి 90కోట్ల రూపాయలు చెల్లించినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని వారు వెల్లడించారు. అసలు తమ ప్రభుత్వానికి అపోలో ఆసుపత్రి బిల్లులే పంపలేదని చెప్పారు. 75 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో ఉన్న జయకు అత్యున్నత చికిత్స అందినట్టు వారు చెప్పారు.