జయలలిత మృతి-శోక సంద్రంలో అభిమానులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారు. సెప్టెంబర్ 22వ తేదీనుండి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది దీనితో జయలలిత అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. జయలలిత తుదిశ్వాస విడిచిన విషయాన్ని అపోలో ఆస్పత్రి వర్గాలు సోమవారం రాత్రి 11.30 కు వెల్లడించాయి.  అత్యంత ప్రభావశీలురైన తమిళనాడు నేతల్లొ ఒకరైన జయలలిత ఆభిమానులను సోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. అమ్మగా తమిళనాడు ప్రజలు పిల్చుకునే జయలలిత తమిళనాడుతో పాటుగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. పట్టువిడవని నేతగా పేరుగాంచిన జయలలిత మరణం తమిళనాడుతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను శోక సంద్రంలో ముంచింది.