జయలలిత మృతి అంటూ తమిళ ఛానెల్స్ ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందారని తమిళనాడులోని కొన్ని ఛానెల్స్ వార్తలు ప్రసారం చేశాయి. అయితే మళ్లీ వెంటనే ఆ వార్తలను నిలిపివేశాయి. తమిళ ఛానల్స్ లో ఒక వైపు జయ మృతి వార్త వస్తున్న తరుణంలోనే అపోలో ఆస్పత్రి జయలలిత ఆరోగ్యం పై మరోసారి హెల్త్ బులెటన్ ను విడుదల చేసింది.  ఆపోలో వైద్యులతో పాటుగా ఎయిమ్స్ వైద్యులు కూడా జయలలిత ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారని అయితే ఆమె పరిస్థితి మాత్రం అత్యంత విషమంగానే ఉందని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. అటు ఆసుపత్రి బైట మాత్రం అమ్మ అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆసుపత్రిలోకి దూసుకునివచ్చేందుకు ప్రయత్నిస్తూ బ్యారికేడ్లను ధ్వంసం చేశారు.