జయకు సీరియస్-ఆస్పత్రివద్ద ఉధ్రిక్తత

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతారవరణం నెలకొంది. గత రెండు నెలలుగా ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యం మెరుగైనట్టు తొలుత వార్తలు వచ్చిన కొద్ది సేపటికే ఆమెకు గుండెనొప్పి వచ్చినట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో హుటాహుటిన గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబాయి నుండి చెన్నైకు వచ్చారు. జయ ఆరోగ్యం విషమంగా ఉండడంతో పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు జయ అభిమాలును తరలివచ్చారు. ఆస్పత్రి లోపలికి చొచ్చుకుని పోయేందుకు జయ అభిమానులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతుండడంతో అదనపు బలగాలను మోహరించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు అందినట్టు సమాచారం.