చౌటుప్పల్ లో భుముల కబ్జా…

ఖాళీగా భూమి కనిపిస్తే చాలు నకిలీ పత్రాలు సృష్టించడం వాటిని అమ్ముకోవడం మామాలైపోయింది. అత్యంత పకడ్బందీగా నకిలీ పత్రాలను సృష్టిస్తూ ఎకరాలకు ఎకరాల భూములను కబ్జాచేస్తున్నారు. కబ్జాదారులకు రెవెన్యు, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఉద్యోగుల సహకరం ఉందనేది బహిరంగ రహస్యమే.   ఇదే తరహాలో చౌటుప్పల్‌లో  భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించి 24 ఎకరాల భూమిని కబ్జాచేశారు. ఈ కబ్జాలో మొత్తం  21 మంది ప్రమోయం ఉన్నట్టు తెలిసింది.  . ప్రధాన సూత్రదారి బీబీనగర్‌కు చెందిన గోలి పింగల్ రెడ్డి గా పోలీసులు గుర్తించారు. కబ్జా బాగోతం పోలీసుల దృష్టికి రావడంతో ప్రధాని నిందుతునితే   సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఎదుట పోలీసులు హాజరపరిచారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పేపర్లు, రెవెన్యూ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కబ్జా బాగోతాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.