చేతులెత్తేసిన బ్రాండ్ ఫ్యాక్టరీ….

0
27

హైదరాబాద్ లో బ్రాండ్ ప్యాక్టరీ షోరూంల ముందు ప్రజలు క్యూ కడుతున్నారు. పెద్ద సంఖ్యలో కొనుగోలు దారులు బ్రాండ్ ప్యాక్టరీ షోరూంలకు రావడంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. మరి కొన్న చోట్ల తాత్కాలికంగా షోరూంలను మూసివేస్తున్నారు.వినియోగదారులను తట్టుకోలేక బ్రాండ్ ప్యాక్టరీ చేతులెత్తేసింది.  కొనుగోలు దారుల నుండి ఒత్తిడి పేరగడంతో పోలీసుల సహాయాన్ని షూరూం నిర్వాహకులు కోరుతున్నారు. ఐదు వేల రూపాయల విలువైన వస్తువులను కొనుగోలు చేసి రెండు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, చెల్లించిన రెండు వేల రూపాయలు కూడా క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి వినియోగదారుడి వద్దకే వస్తాయంటూ పెద్ద ఎత్తున బ్రాండ్ ఫ్యాక్టరీ నిర్వహాకులు ప్రచారం చేశారు. దీనితో పెద్ద సంఖ్యలో షోరూంలకు ప్రజలు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడంతో భారీ క్యూ లైన్ లు ఏర్పడ్డాయి. దీనితో చాలా చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వినియోగదారుల రద్దీని తట్టుకోలేక కొన్ని చోట్ల షోరూంలను తాత్కాలికంగా మూసివేశారు. దీనితో షోరూంకు వచ్చిన వినియోగదారులు నిర్వహకులతో వాగ్వాదానికి దిగారు. ప్రకటనలు ఇచ్చి తీరా వచ్చాయ చేతులెత్తివేస్తే ఎట్లా వారితో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు సర్థిచెప్పాల్సి వచ్చింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here