చెన్నైవైపు తుపాను-భయంతో వణుకుతున్న ప్రజలు

బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన పెను తుపాను వార్థా చెన్నై వైపు కదులుతోంది. ఈ తుపాను నెల్లూరు-మచిలీపట్నం ల మధ్యను తీరాన్ని దాటుతుందని తొలుత భావించినా తుపాను అఖస్మాత్తుగా దిశను మార్చుకుని చెన్నై వైపు కదులుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ధాటికి భారీగా వర్షలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
   తుపాను ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 520, మచిలీ పట్నానికి తూర్పు ఆగ్నేయదిశగా 490, చెన్నైకి తూర్పున 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను మందకోడిగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
    చెన్నై వైపు తుపాను కదులుతుండడంతో చెన్నై వాసులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గత సంవత్సరం ఇదే నెలలో కనీవినీ ఎరుగని రీతిలో చెన్నైని వరదలు ముంచెత్తాయి. తిరిగి ఇదే నెలలో భారీ వర్ష సూచన వెలువడడంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.