చుడీదార్ తో వస్తే నో ఎంట్రీ

మహిళలు చుడీదార్ తో తిరువనంతపురం లోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి వస్తే అనుమతించరు. చాలా కాలంగా ఈ ఆలయంలోకి మహిళలు చీర లేదా కేరళ సంప్రదాయం ప్రచారం ముండు గా పిల్చుకునే పంచెను కట్టుకుని మాత్రమే ఆలయంలోకి రావాలనే నిబంధన ఉండేది. ఇటీవల ఈ సంప్రదాయంలో కొద్దిగా మార్పులు చేసి చుడీదార్ తో కూడా ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ఈఓ ఆదేశాలు జారీచేశారు. దీనిపై మండిపడ్డ కొంత మంది ఆలయ ఈఓ చేసిన మార్పులపై కోర్టుకెక్కారు. ఈ కేసును విచారించిన కేరళా హై కోర్టు ఆలయ ఈఓ జారీచేసిన ఆదేశాలు చెల్లవంటూ తీర్పు చెప్పింది. ఆలయ ఆచార వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే అధికారం కేవలం ఆలయ ప్రధాన అర్చకుడికి మాత్రమే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దీనితో శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి వచ్చే మహిళా భక్తులను చుడీదార్ తో అనుమతించరు. ఒక వేళ చుడీదార్ తో ఆలయం వద్దకు వచ్చినా దానిపైన పంచె కట్టుకోవాల్సి ఉంటుందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి.