చివరి చూపుల కోసం వెల్లువెత్తున్న అభిమానులు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రాజాహీ హాల్ కు తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం జయ మృతదేఙాన్ని రాజాజీ హాల్ లో ఉంచారు. అపోలో ఆస్పత్రి నుండి ముందుగా జయనివాసం పోయేస్ గార్డెన్ కు జయ మృతదేహాన్ని తరలించారు. అక్కడి నుండి ప్రజల ఆఖరి చూపుల కోసం జయలలిత మృతదేహాన్ని రాజాజీ హాల్ కు తరలించారు. అమ్మను కడసారి దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అమ్మ మృతదేహాన్ని చూసిన ఆమె అభిమానుల దుఖం కట్టలు తెంచుకుంది. విగతజీవిగా జయలలితను చూసిన ఆమె అభిమానులు బోరున విలపిస్తున్నారు. ప్రజల సందర్శన అనంతరం జయ మృతదేహానికి మెరీనా బీచ్ లోని ఎంజేఆర్ సమాధి వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు.