చలికాలంలో చర్మ సంరక్షణ

0
9

చలికాలంలో ఆరోగ్య సమస్యలు చాలానే ఎదురవుతుంటాయి ప్రధానంగా చలికాలంలో చర్మ సమస్యలు చాలా ఎదురవుతాయి.  చలికాలంలో చర్మం చాలా డ్రైగా మారిపోతుంది.మీ చర్మం డ్రైగా మారడానికి చాలా కారణాలుంటాయి. చలికాలంలో ప్రతి ఒక్కరి చర్మం డ్రైగా మారుతుంది అనుకుంటాం. కానీ.. ఇది పొరపాటు. చలికాలంలో చర్మం పొడిబారడానికి చాలా కారణాలున్నాయి. మీ చర్మంలోపల ప్రభావాన్ని బట్టి ఇలా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చలికాలంలో డ్రై స్కిన్ సమస్య ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం రోజూ చేసే పనులే.. మన సున్నితమైన చర్మానికి హాని చేస్తాయి. చర్మం డ్రైగా, పొడిబారకుండా ఉండాలంటే.. శరీరంలో వాటర్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేయాలి. హైడ్రేట్ గా ఉంటే..చర్మం గ్లోయింగ్ మారుతుంది. అలాగే.. చర్మం డ్రై అవడానికి కారణమయ్యే.. విషయాలను కూడా తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి. చర్మ రోగాలు ఉన్నవారికి చలికాలంలో ఈ సమస్యలు మరింత ముదురుతాయి అందుకని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది.
మీ చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడే కొన్ని వెజిటేబుల్ జ్యూసులు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

క్యారెట్ జ్యూస్:

గ్లోయింగ్ స్కిన్ కు ఒక ఉత్తమ వెజిటేబుల్ జ్యూస్ క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూలస్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది . అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్ ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. ఇది మిమ్మల్ని యంగ్ గా మరియు రేడియంట్ గా మార్చేస్తుంది.

టమోటో జ్యూస్:

చాలా సహజంగా ప్రతి ఇంట్లోనే తయారుచేసుకొనే జ్యూస్ లలో కామన్ జ్యూస్ ఇది. టమోటోను ఫ్రూట్స్ గాను మరియు వెజిటేబుల్ గాను భావిస్తుంటారు. వీటిని వివిధ రకాల వంటలో ఉపయోగిస్తుంటారు. టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి చాలా గ్రేట్ గా భావిస్తారు.

బేబీకార్న్ జ్యూస్:

ఇది చాలా ఎక్కువగా పాపులర్ అయినటువంటి సూప్ లేదా జ్యూస్. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఫ్లూయిడ్ డైట్ ను ఎక్కువగా ఇష్టపడే వారికి ఒది ఒక హెల్తీ డైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో అధిక క్యాలోరిక్ వాల్యు కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తారు. ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుందని చెప్పవచ్చు.

పచ్చిబఠానీ జ్యూస్:

ఈ వెజిటేబుల్ సీడ్స్ ను వివిధ రకాల వంటాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. పచ్చిబఠానీల్లో విటమిన్ బి6 మరియు కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన శరీరానికి అత్యవసరమైన ఆహారంగా భావిస్తారు . పచ్చిబఠానీలతో తయారుచేసే జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మిరయు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని గ్లోయింగ్ గా మరియు రేడియంట్ గా మార్చడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ఆకుకూరల రసాలు:

ఆకుకూరలతో సూప్స్ తయారుచేయడం ఒక ఉపాయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రసాల్లో విటమిన్ కె పుష్కలంగా ఉండే బోన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. మరో మూలకం ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యం పెంపొందించడంలో ఒక ఐడియల్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. విటమిన్ సి మరియు ఇ మరియు మినిరల్స్ మరియు మెగ్నీసియం గొప్ప యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి శరీరంలో ఫ్రీరాడిక్ల్స్ నుండి దూరంగా ఉంచుతుంది. ఈ ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం దెబ్బతింటుంది మరియు డల్ గా మారుతుంది.

బ్రొకోలీ జ్యూస్:

గ్రీన్ కాలీఫ్లవర్ బాగా పాపులర్ వెజిటేబుల్, ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు దీన్ని ఎక్కువ గా తీసుకుంటుంటి. అన్ని రకాల వెజిటేబుల్స్ కంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎక్కువ పోషకాంశాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ుంటుంది . ఇదిహెల్తీ స్కిన్ కోసం చాలా అవసరమైనటువంటివి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి, చర్మానికి మరియు శరీరానికి చాలా ఉపయోగకరమైనది

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here