చక్రస్నానంతో ముగిసిన కోదండ‌రాముని బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రా.నికి స్నానం చేయించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం పాల్గొన్నారు.
ఏప్రిల్ 11న పుష్పయాగం ఆలయంలో ఏప్రిల్ 11న శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *