చండీగఢ్ లో బీజేపీ కూటమి భారీ విజయం

చంఢీగఢ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాళీదళ్ కూటమి సత్తా చాటింది. ఈ కూటిమి చండీగఢ్ ఎన్నికల్లో భారీ వియాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ ఎన్నికలకు ముందు చండీగఢ్ లో ఈ విజయం బీజేపీ,ఆకాలీదళ్ కూటమికి మంచి బలాన్ని ఇచ్చిందనే చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తరువాత కీలక చండీగఢ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడం ద్వారా ఈ కూటమి తన సత్తాని చాటినట్టయింది. మొత్తం 26 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శిరోమణి అకాలీదళ్ కూడమి 20 సీట్లను కైవసం  చేసుకుని ఇతరులకు అందనంత ఎత్తులో నిల్చింది. కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. 17 స్థానాల్లో పోటీ పడ్డ బీఎస్పీ ఖాతా తెరవలేకపోయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *