గుప్తనిధులకోసం భార్య హత్య

గుప్తనిధులపై ఆశ మహిళ ప్రాణాలు తీసింది. భర్త, కుమారుడి చేతిలోనే సదరు మహిళ హత్యకు గురి కావడం మరీ దారుణం. మహిషి సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నా సమాజంలోమూఢ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. మంత్రాలు, తంత్రాల పేరుతో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో గుప్త నిధులు దొరుకుతాయన్న పిచ్చి నమ్మకంతో ఒక వ్యక్తి కట్టుకున్న భార్యనే గొంతుకోసి చంపాడు. అతనికి కొడుకు సహాయం  చేశాడు.

హైదరాబాద్ నడిబొడ్డున ఎంఎస్ మక్తాలో అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కొడుకు కలిసి గొంతుకోసి పరారయ్యారు. గుప్త నిధుల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం తండ్రీ కొడుకులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. ఈ హత్య కేసును పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.