గతమెంతో ఘనం ఇది కమ్యూనిస్టుల స్థితి

జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక వేలుగు వెలిగిన కమ్యూనిస్టులు నేడు అస్థిత్వం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతమెంతో ఘనం అంటూ పాడుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కమ్యూనిస్టుల్లో కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాల్లో కానీ ప్రజల తరపున ఉధ్యమాలు చేయడంలో కానీ కమ్యూనిస్టులు ఆది నుండి ముందజలోనే ఉన్నా ఓటు రూపంలో ప్రజల మద్దతు కూడగట్టడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. ప్రధాన పక్షాలకు కమ్యూనిస్టులు తోక పార్టీలు గానే మిగిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సిద్ధాంతపరంగా అగ్రభాగాన ఉండే కమ్యూనిస్టు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో మాత్రం చేతులెత్తేస్తున్నాయి.
కమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ప్రజల కోసం పని చేస్తాయి . కమ్యూనిస్టుల మార్గమే సరియైనది. ఇదీ కమ్యూనిస్టులు నమ్మకున్న సిద్ధాంతం వారు ప్రచారం చేస్తున్నది కూడా ఇదే అయితే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు అనేక రకాల కారణాలు కమ్యునిస్టులను ప్రగతి నిరోధకులనే ముద్రవేసి వేసి ఊరుకుంది.
కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఇతర పార్టీల్లోని  అన్ని అవలక్షణాలు వచ్చి చేరాయి. అధికారం కోసం ఆరాటం, కుల రాజకీయాలు వంటబట్టాయి. దీనితో కమ్యూనిస్టులపై ఉన్న గౌరవం తగ్గింది. కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఆ పార్టీల కొంప ముంచుతోంది. కమ్యూనిస్టుల ఐక్యత అనేది చర్చలకే పరిమితం అవుతోంది.
కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే వారు ఎన్ని మాటలన్నా భారతీయ రాజకీయాల్లో నేటీకీ కమ్యూనిస్టు పార్టీల పాత్రను కొట్టిపారేయలేం. భారత దేశాన్ని సమ్రాజ్యవాద శక్తుల నుండి కాపాడిన ఘనత ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలకే దక్కుతుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడంలో కమ్యూనిస్టుల పార్టీలను మించిన వారు మరొకరు లేరు. పేద, బీద జనాలకు అండగా నిలుస్తోంది కూడా ఎర్ర జెండా మాత్రమే. సామాజిక ఆర్థిక రంగాల్లో కమ్యూనిస్టు మేధావుల సూచనలు ఆచరణనీయమే.
 
సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటుగా ఇటీవల తీసుకున్న పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. పార్టీ పటిష్టత కోసం రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాల పై కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *