ఖననం ఎందుకు చేయాల్సి వచ్చింది….

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల ముగిశాయి. చెన్నైలోని మెరినా బీచ్ వద్ద జయలలిత బౌతిక కాయాన్ని ఖననం చేశారు. అయితే జయలలిత అంత్యక్రియలపై వివిద రకాల వాదనలు వినిపిస్తున్నాయి.  అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయలలిత అంత్యక్రియలు హింధు సంప్రదాయ ప్రకారం జరిగిన అమె దేహాన్ని దహనం చేయకుండా ఎందుకు ఖననం చేయాల్సి వచ్చిందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఒక వాదన ప్రకారం జయలలిత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు అయినప్పటికీ ద్రవిడ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ద్రవిడ సంస్కృతి మేరకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు జయలలిత మృతి చెందిన తరువాత అమె వారసత్వం పై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. జయ లలిత ఆస్తితో పాటుగా ఆమెకు సంబంధించి పూర్తి వ్యవహారాలను ఇప్పటివరకు ఆమె నెచ్చెలి శశికళనే చూసుకుంటూ వస్తున్నారు. జయలలిత కు దహన సంస్కారాలు నిర్వహించాల్సి వస్తే శశికళ అంత్యక్రియల కార్యక్రమాలను దూరంగా ఉండాల్సి వస్తుందనే కారణంగానే ఆమెను ఖననం చేశారనే గుసగుస వినపడుతున్నాయి. జయ అంత్యక్రియల కార్యక్రమంలో శశికళతో పాటుగా జయలలిత మేనల్లుడు దీపక్ కూడా పాల్గొన్నారు. మరో వైపు జయలలిత అవివాహిత కావడం వల్లే ఖననం చేశారని అంటున్నారు. బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబానికి చెందిన సంప్రదాయాల ప్రకారం పెళ్లివారిని ఖననం చేసే సంప్రదాయం ఉండడం వల్లే ఖననం చేశారనే వార్తలు వస్తున్నాయి. అమె అంత్యక్రియలు ఎట్లా జరిగినా అమె మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోతారనేది మాత్రం సత్యం