క్షణాల్లో తిరుమల దర్శనం టికెట్లు ఖాళీ

తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 1వ తేదీ, వైఖుంఠ ద్వాదశి జనవరి 9వ తేదీకి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోయాయి. కొత్త సంవత్సరం రోజును తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపధ్యంలో ఆన్ లైన్ లో రు.300 టికెట్లను టీటీడీ విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అయినపోయాయి. కోటా విడుదల అయి అవకుండానే టికెట్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. దీనితో ఈ సారి కూడా సామాన్య భక్తులకు నిరాశే మిగిలింది. కోటా విడుదల అయిన కొద్ది సేపు కూడా టికెట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటా విడుదలకు ముందు నుండే చాలా మందికి అసలు వెబ్ సైట్ తెరుచుకోనే లేదు. తీరా నెబ్ సైట్ ఓపెన్ ఐతే టికెట్లు అయిపోవడంతో భక్తులు ఊసూరు మంటున్నారు. వైకుంఠ ఏకాదశి టికెట్లను మాత్రం టిటిడి విడుదల చేయలేదు.