క్యాంపు కార్యాలయంలో కోవిడ్ 19 నివారణా చర్యలపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సహా అధికారులు హాజరు అయ్యారు. రాష్ట్రంలో కేసుల పరిస్థితి, వ్యాధి నివారణా చర్యలను అధికారులు వివరించారు. కోవిడ్ – 19 నివారణకోసం ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు అదనంగా ఐదేసి ఆస్పత్రుల చొప్పున గుర్తిస్తున్నామని అధికారులు తెలియచేసారు. క్రిటికల్ కేర్‌కోసం నాలుగు ప్రధాన ఆస్పత్రులు, ప్రతి జిల్లాకూ ఒక ఆస్పత్రి సన్నద్ధం అయ్యాయని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాలకు అదనంగా ఐదు ఆస్పత్రుల చొప్పున సిద్ధంచేస్తున్నామని అధికారులు సమావేశం లో తెలిపారు. క్వారంటైన్, ఐసోలేషన్ గదుల్లో సదుపాయాలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేసారు.
ఐసోలేషన్‌లో పెట్టేవారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని సీఎం స్పష్టంచేసారు. అక్కడ సౌకర్యాలు, సదుపాయలు ఉండేలా అధికారులు దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడోసారి జరుగుతున్న కుటుంబ సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఉన్నవారి అందరికీ కూడా పరీక్షలు చేయించాలని మరోసారి స్పష్టంచేసిన సీఎం.