a09–04–2020,
అమరావతి.
రోజు రోజు కు పెరుగుతున్న కరోనా పీడితుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరింత కలవర పెడుతోంది. ప్రజలు బయట తిరగ కుండా లోక్డౌన్ ను పకడ్బందీ గ పాటించటానికి రెండు రోజుల క్రితమే ఆక్టోపస్ బలగాలను కూడా రాష్ట్రము లోని కీలక ప్రాంతాల లో మోహరించారు. గౌ. ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికి అప్పుడు కీలక సమాచారాన్ని అన్ని విభాగాధి పతుల నుండి సేకరిస్తూ సమీక్ష లు జరుపుతున్నారు. ఈ రోజు కూడా
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష జరిపారు.
హాజరైన వారిలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.