కేసీఆర్ భజనకే అసెంబ్లీ:రేవంత్

కేసీఆర్ భజన కోసమే తెలంగాణ రాష్ట్ర శాసనసభ నడుస్తున్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ శాశనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను పొగిడితేనే సభలో మైక్ వస్తుందని ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు దారుణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్పీకర్ కార్యాలయం రాజకీయ కేంద్రంగా మారిందని విమర్శించారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కలిసి రావాలని లేకుండా టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నట్టుగానే భావించాల్సి వస్తుందన్నారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షేభం గురించి, రైతుల దుస్థితిగురించి తనకు సభలో మాట్లాడే అవకాశం లభించడం లేదన్నారు. రైతులు చేసుకుంటున్నవి ఆత్మహత్యలు కావని వాటిని ప్రభుత్వం హత్యలుగానే భావించాల్సి వస్తుందన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై హత్యాకేసును నమోదు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం కేంద్రం పంపిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని ఆ పార్టీలోనే టీఆర్ఎస్ అభిమానులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని రేవంత్ దుయ్యబట్టారు.
మరోవైపు టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిపై విరుచుకుని పడింది. చంద్రబాబు ప్రాపకం ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండి పడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయితే తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరో ధైర్యంగా చెప్పాలన్నారు. తెలంగాణ కు అన్యాయం చేసిన వారి చంకలో చేరి తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాట్లాడడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పనులు రేవంత్ కు కనిపించడం లేదా అని మండిపడ్డారు. కేసీఆర్ చేస్తున్న మంచి పనులను మెచ్చుకునే సంస్కారం ఎటూ లేని రేవంత్ రెడ్డి అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం పై అభాండాలు వేయవద్దారు. తప్పుడు సమాచారంతో సభను పక్కదారి పట్టించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *