కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీలు

నాగ్‌పూర్‌: బంగ్లాతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో బంగ్లాకు టీమిండియా 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడగా.. అయ్యర్‌ (62; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో షఫీల్‌ ఇస్లామ్‌, సౌమ్య సర్కార్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అల్‌ అమీన్ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు.