ఆరోగ్య శాఖ వీడియో కాన్ఫరెన్స్

0
206

కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ BRKR భవన్ నుండి పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్.
రాష్ట్రం, దేశంలో లో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని కోరిన మంత్రి. అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలను కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని కూడా కోరారు.

వెంటిలేటర్ లు, ఇతర వైద్య పరికరాలు ECIL, DRDO లాంటి సంస్థల్లో తయారుచేసి ప్రభుత్వాలకు అందజేయాలని కోరిన మంత్రి ఈటల రాజేందర్. N-95 మాస్కులు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
వైద్య పరికరాలు మరియు కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, కేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలని మంత్రి ఈటల కోరారు.

ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు అని, ఇప్పటికీ 8500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలింది. 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా , 12 మంది చనిపోయినట్లు తెలిపారు.
లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here