కూలీల బతుకులపై నోట్ల రద్దు బండ…

నోట్ల రద్దు ప్రభావం అన్ని వర్గాలతో పాటుగా వలస కీలలపై విపరీతంగా పడింది. నోట్ల రద్దు తరువాత వలసకూలీల బతుకులు దయనీయంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది వలస కూలీలు హైదరాబాద్ లో వివాసం ఉంటున్నారు. నిర్మాణ రంగ పనుల్లో పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న వీరి జీవితంలో నోట్ల రద్దు పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. నోట్ల రద్దు తరువాత నిర్మాణ రంగం దాదాపుగా కుంటుపడింది. నిర్మాణపు పనులు అరకొరగానే సాగుతున్నాయి.

బ్యాంకుల నుండి నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో కొన్ని నిర్మాణపు పనులు మినహా చాలా చోట్ల పనులకు బ్రేక్ పడింది. జరుగుతున్న అరాకొరా పనుల్లో కూడా రోజువారీ కూలీ ఇవ్వడం లేదు. నాలుగు రోజులకు లేదా వారానికి కలిపి ఓకేసారి కూలీ ఇస్తామని చెప్తుండడంతో రోజూ వారీ కూలీల మీద ఆధారపడి బతికే వారి బతుకులు ధీనంగా మారాయి. ఒక వైపు నిర్మాణపు పనులు చురుగ్గా కాగకపోవడం మరో వైపు కూలీలు బ్యాంకుల్లో వేస్తామని చెప్తుడడంతో వీరి పరిస్థితి దారుణంగా మారింది. నిర్మాణపు కూలీల్లో చాలా మందికి అసలు బ్యాంకు అకౌంట్లు లేవు. బ్యాంకు లావా దేవీలపై సరైన అవహాగాన లేదు. అంట్లాటప్పుడు బ్యాంకుల్లో డబ్బులు వేస్తే తాము ఏం చేయాలని వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్లు ఉన్న వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేసినప్పటికీ అవి తీసుకోవడానికి తిప్పలు తప్పడంలేదు. సగరం రోజు బ్యాంకు లైన్లలో నిలబడడం వల్ల దొరికే అరకొర కూలీ కూడా పోతోందని వాపోతున్నారు. గంటల తరబడి బ్యాంకు లైన్లలో నిల్చున్నప్పటికీ బ్యాంకులో రెండు వేల రూపాయల నోట్ల ఇవ్వడంతో చిల్లర మరో పెద్ద సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. ఏ దుకాణంలోనూ చిల్లర దొరడం లేదని వారు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ బదుతులు మరీ దయనీయంగా మారాయని కూలీలు వాపోతున్నారు.