కుదుటపడుతున్న అమ్మ ఆరోగ్యం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగు పడుతోంది. జయలలిత ఆరోగ్యంగా తిరిగి రావడం కోసం ఆమె అభిమానులు చేసిన పూజలు ఫలించినట్టుగానే కనిపిస్తున్నాయ. అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత కోలుకుందని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తన పనులు తాను చేసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ఐసీయు నుండి గతంలోనే జనరల్ వార్డుకు మారిన జయలలిత ఆరోగ్యం మరింత మెరుగయిందని త్వరలోనే ఆమె తిరిగి  ఇంటికి చేరుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. జయలలిత ఆరోగ్యం మెరుగు కావడంతో అమ్మ అభిమానులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పురిచ్చితలైవి ఇంటికి వస్తారని వారంటున్నారు. జయలలిత ఆరోగ్యంపై పలు పుకార్లు చేసిన విషయం తెలిసిందే.