కుక్క,పిల్లి మాంసంతో వంటకాలు

లాభాలకోసం కొంతమంది వ్యాపారులు ఎంటి నీచానికైనా పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో మృత కళేబరాలాతో చేసిన నూనేనును అనేక హోటళ్లలో వాడుతున్నట్టు పోలీసులు కనుగొనగా తాజాగా చెన్నై, బెంగళూరు నగరాల్లోని కొన్ని హోటళ్లు, రోడ్ల పక్కన ఉన్న చిరు ఆహారపు బండ్లవారు మేక మాంసం పేరిట కుక్క, పిల్లి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. మేక మాంసం పేరిట కుక్క, పిల్లి మాంసాన్ని, జంతు మాంసాన్ని పెడుతున్న సంగతి వాస్తవమేనని గతంలో పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా సంస్థ నిర్థారించింది. రోడ్ల పక్కన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న మాంసాన్ని వీరు పరీక్షించి మాంసంలో పిల్లి మాంసం కలిసి ఉందనే విషయాన్ని నిర్థారించారు. బండ్ల వ్యాపారులకు పిల్లులను అమ్ముతున్న వారిని కూడా వీరు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తక్కువ రేటుకు మాంసాన్ని సరఫరాచేయడం కోసంగాను చిన్న వ్యాపారులతో పాటుగా కొందరు హోటల్ యజమానులు కూడా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మేక మాంసంపేరిట పిల్లి, కుక్కల మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నట్టు పీఎఫ్ సిఐ పేర్కొంది. చెన్నై, బెంగళూరుతో పాటుగా దేశంలోని అనేక నగరాల్లోని హోటళ్లుపై దృష్టి పెట్టామని నిఘాను పటిష్టం చేసి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *