కాచిగూడలో రెండు రైళ్లు ఢీ..

హైదరాబాద్‌లోని కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. సిగ్నల్ చూసుకోకుండా.. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్..మరొక ఇంటర్‌ సిటీ ట్రైన్ రెండు రైళ్లు ఢీ కొన్నాయి. దీంతో రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. అటు నుంచి.. ఇటు నుంచి.. వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకేసారి అక్కడి ప్రయాణికులు భయాందోళన చెందారు.