కలెక్టర్లకు సీఎం దిశానిర్థేశం

రాష్ట్రాభివృద్ధిలో కలెక్టర్లదే కీలక బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో జరగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం మట్లాడారు. ప్రభుత్వ అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలని, సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పారద్రోలే బాద్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. అందుకు అనుగుణంగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని దీనికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులు కొత్త ప్రణాళికలతోముందుకు రావాలన్నారు. మిషన్ భగీరద పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచింారు. అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు గాను ప్రతీ కలెక్టరు వద్ద మూడు కోట్ల రూపాయలను ఉంచుతున్నట్టు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఈ నిధి నుండి అవసరాలకు వాడుకోవచ్చని అన్నారు. శ్మాశానవాటికల నిర్మాణం చేపట్టాలని పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలన్నారు.