కరుణానిధి అంత్యక్రియలు పూర్తి

0
58

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాల నడుపు మెరినా బీచ్ లోని అన్నాదురై సమాధి సమీపంలోనే కరుణానిధి పార్థీవదేహాన్ని ఖననం చేశారు. నాస్తిక వాది అయిన కరుణానిధి మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో ఎటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించలేదు. భారత ప్రభుత్వం తరపున సైనిక జవాను, తమిళనాడు ప్రభుత్వం తరపున రాష్ట్ర పోలీసులు గౌరవవందనం సమర్పించారు. కలంజర్ మృతదేహంపై ఉంచిన జాతీయ పతాకాన్ని ఆయన తనయుడు స్టాలిన్ కు అప్పగించారు. ఆ సమయంలో స్టాలిన్ భావోద్వేగానికి లోనయ్యారు.
లక్షలాది మంది కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలతో పాటుగా పెద్ద సంఖ్యలో వీవీఐపీలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు ఆఖరిసారిగా కరుణానిధి మృతదేహానికి నివాళులు అర్పిస్తూ బోరున విలపించారు. తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవగౌడ, శరద్ పవార్, వీరప్ప మెయిలీ, గులాంనబీ ఆజాద్ లతో పాటుగా పలువురు నేతలు హాజరయ్యారు. అంతుకు ముందు ప్రధాని నరేంద్రమోడి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు ముఖ్యనేతలు కరుణానిధికి నివాళులు అర్పించారు.

మెరినా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు


వీసా గడువు ముగిసినా అమెరికాలోనే

Wanna Share it with loved ones?