శాంతిభద్రతల పరిరక్షణ రీత్యా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమకుతామేసాటి అని కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు నిరూపించుకుంటున్నారు. కరోనా వైరస్వ్యాప్తి నేపధ్యంలో లాక్డౌన్, రాత్రి వేళల్లో కర్ఫ్యూలు అమలవుతున్న విషయం విదితమే. కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి లాక్డౌన్, కర్ఫ్యూ అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ముందుకుసాగుతూ పటిష్టంగా లాక్డౌన్, కర్ఫ్యూలను అమలుచేస్తున్నారు.
ఒకవైపు డ్రోన్కెమెరాలను వినియోగిస్తూ, మరోవైపు కమాండ్కంట్రోల్ వాహనం ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జనం గుంపులుగా జమకూడి ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ ఆయా ప్రాంతాలలో విధులను నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందిస్తూ అక్కడ ఉన్నవారిని చెదరగొట్టడం జరుగుతున్నది. కమీషనరేట్ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో సఫలీకృతం అవుతూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్, కర్ఫ్యూల అమలులో రాష్ట్రవ్యాప్తంగా కమీషనరేట్ పోలీసులు ముందున్నారు. రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి ఈమేరకు పోలీస్ కమీషనరేట్లో తీసుకుంటున్న చర్యలను వివిధ జిల్లాలకు చెందిన అధికారులకు వివరించడం గర్వకారణం.
గతంలో ప్రజల రక్షణ,భద్రతలో దేశవ్యాప్తంగా నాల్గవస్థానం, ప్రజల సమస్యలపై సత్వరం స్పందిస్తూ సేవలందించడంలో దేశవ్యాప్తంగా ఎనిదవస్థానం, రాష్ట్రంలో మొదటి స్థానాన్ని కమీషనరేట్‌లోని చొప్పదండి పోలీసులు సాధించిన విషయం విదితమే. లాక్డౌన్, రాత్రివేళల్లో కర్ఫ్యూల అమలకోసం టెక్నాలజీ వినియోగంతోమందుకుసాగుతున్న పోలీసులు ప్రజలు సడలింపుల సమయాలలోనే మాత్రమే బయటకు వచ్చి నిత్యావసర వస్తువులను కొనుగోలుచేసుకుని ఇళ్ళలోకి వెళ్ళి స్వీయనిర్భంధాన్ని పాటించాలని కోరుతున్నారు.
పోలీసులకు శానిటైజర్లు అందజేత
కరీంనగర్‌లోని మహింద్ర మోటార్‌లైన్ సంస్థ లాక్డౌన్, కర్ఫ్యూల అమలులో రేయింబవళ్ళు శ్రమిస్తున్న పోలీసుల కోసం శానిటైజర్లను గురువారం నాడు ఆసంస్థ డైరెక్టర్ సునీల్ కోకిలవాని ఆదేశాల మేరకు స్థానిక బ్రాంచి మేనేజర్ వడ్లూరి రాజు గురువారం నాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డికి శానిటైజర్లను అందజేశారు. పోలీసుల సేవలను గుర్తించి శానిటైజర్లను అందించిన సంస్థనిర్వాహకులను పోలీస్ కమీషనర్ అందజేశారు.