ఔటర్ పై కారు దగ్దం-నలుగురు మృతి

ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా వరంగల్, ఆదిలాబాద్  జిల్లాలకు చెందిన వారు. ఒక మిత్రుడిని విమానం ఎక్కించిన తరువాత తిరిగివస్తున్న క్రమంలో పెద్ద అంబర్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందారు. మృతులను పరకాలకు చెందిన శివకృష్ణ, శ్రీకాంత్,  బెల్లంపల్లికి చెందిన శశిధర్, నర్సక్కపల్లికి చెందిన రాజులుగా గుర్తించారు. మిత్రుడు భాస్కర్ ను శాంషాబాద్ విమాశ్రయంలో విమానం ఎక్కించిన తరువాత సోమవారం తెల్లవారు జామున ఔటర్ రింగ్ రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న ఆల్టోకారు అదుపుతల్లి డివైడర్ ను ఢీకొట్టింది. అత్యంత వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దం అయింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో తోపాటుగా నలుగురు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్దం కావడంతో వారంతా సజీవదహనం అయ్యారు. ఘటనా స్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది.